అందరూ చూస్తుండగానే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం 

నిందితుని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్

అందరూ చూస్తుండగానే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం

బగ్గుమన్న ఉద్యమకారులు, నిరసన వ్యక్తం

నిందితుని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

జనవరి 16, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి : శేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మద్యం మత్తులో మహావీర్ కాలనీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి ధ్వంసం చేసిన దుర్ఘటన జరిగింది. మంగళవారం రోజు ఉదయం తప్పతాగి విగ్రహాన్ని కింది కూల్చాడు ఆపైన పక్కనే ఉన్న బండరాయితో విగ్రహాన్ని స్థానికులు అందరూ చూస్తుండగానే ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు గోవిందుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా 124 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇది ఎంతో బాధాకరమైన విషయమని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఒక మూర్ఖుడు దారుణంగా ఆ విగ్రహాన్ని బండతో కొట్టడం చాలా దారుణమైన బాధాకరమైన విషయమని నిజంగా ఈ విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరి మనసును బాధపెట్టాడని పేర్కొన్నారు. ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరుపున కోరుకుంటున్నామని తెలిపారు. సంఘటనతో కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు నిందితుడిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.