జన హృదయనేత, సంక్షేమ పథకాల స్ఫూర్తి ప్రధాత డాక్టర్ వై.ఎస్.ఆర్ 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన మాజీమంత్రి, ఎం.ఎల్. సి బస్వరాజు సారయ్య..

జన హృదయనేత, సంక్షేమ పథకాల స్ఫూర్తి ప్రధాత డాక్టర్ వై.ఎస్.ఆర్ 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీమంత్రి, ఎం.ఎల్. సి బస్వరాజు సారయ్య..

 

జూలై 08, నల్లా సమాచార్ న్యూస్ / హన్మకొండ :

వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వై.ఎస్. చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఏం.ఎల్.సి బసవరాజు సారయ్య, కాంగ్రెస్ నాయకులూ మాట్లాడుతూ…

 • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు బాధత్యలు స్వీకరించి.. తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు.
 • పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి. తెలుగువారికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన.
 • తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో రాజశేఖరరెడ్డి నిలిచిపోతారు.
 • సుధీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న మహానేత
 • దేశంలో సంక్షేమ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్.
 • పథకాల విషయానికి వస్తే ఆరోగ్య శ్రీ నుంచి 108 వరకు.. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నుంచి, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, సున్నా వడ్డీకి రుణాలు, రైతులకు ఉచిత కరెంట్ జలయజ్ఞ‌ం, రూ. 2కే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు వరకు ఇలా చెప్పుకుంటే పోతే చాలా పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల మనసులను దోచుకున్న నేత వైఎస్.
 • ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి.. ప్రశంసలు అందుకున్నాయి..
 • సంక్షేమ పథకాలు గురించి మాట్లాడాలంటే వై.ఎస్ కి ముందు తర్వాత అని చెప్పుకోవాల్సిందే
 • వై.ఎస్ హయం లోని కాంగ్రెస్ పథకాలనే ఇప్పటి ప్రభుత్వం పేర్లు మార్చి వాడుతున్నారని అన్నారు.
 • మహానాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి..
 • ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ రోజు అయన జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు..

ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, అనుబంద సంఘాల అద్యక్షులు బంక సరళ యాదవ్, డాక్టర్ రామకృష్ణ,రేపల్లి రంగనాథ్, మొహమ్మద్ ఖుర్షీద్, నాయకులూ తౌటం రవీందర్, బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మా రెడ్డి, మొహమ్మద్ అంకుష్, రేపల్లె రంగనాథ్, వంశీ, సయ్యద్ అజ్గర్ అలీ, బొంత సారంగం, సేవాదళ్ యాదగిరి, సుగుణ, రాయరపు సాంబయ్య, డివిజన్ అద్యక్షులు మహమ్మద్ జాఫర్, ఎస్. కుమార్ యాదవ్, కొండ నాగరాజు, తాళ్ళపల్లి సుధాకర్,,సయ్యద్ అఫ్సర్, బంక సతీష్ యాదవ్, వల్లపు రమేష్, తడక సుమన్, ఎస్. రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.