ప్రపంచ దయా దినోత్సవం
లైన్స్ క్లబ్ మంచిర్యాల సర్వోత్సవ సంబరాలు భాగంగా నిత్య అన్నదానం కార్యక్రమం
నవంబర్ 13, నల్లా సమాచార్ న్యూస్ / మంచిర్యాల :
నవంబర్ 13″ ప్రపంచ దయా దినోత్సవం (WORLD KIDNESS DAY) పురస్కరించుకొని లైన్స్ క్లబ్ మంచిర్యాల్ స్వర్ణోత్సవ సంబరాల్లో ప్రారంభమైన “నిత్యాన్న ప్రసాద” కార్యక్రమము ఈరోజు 16వ రోజుకు చేరినది. ఈరోజు కార్యక్రమాన్ని సీనియర్ లయన్ మెంబర్ ఎం రామాంజనేయులు కూతురు ఈదర స్వప్న జన్మదినోత్సవ సందర్భంగా మాతా శిశు కేంద్రంలో 200 మందికి నిత్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని లైన్స్ క్లబ్ సభ్యులు ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమాన్ని తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేసినారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ ఏ బాలాజీ, కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, సీనియర్ లైన్ మెంబర్స్ లయన్ రామాంజనేయులు , లయన్ వి మధుసూదన్ రెడ్డి , లయన్ ఎస్ సూర్యనారాయణ , లయన్ కె భాస్కర్ రెడ్డి లయన్ చందూరి మహేందర్, లయన్ కొత్త సురేందర్ , లయన్ గుండా శ్రీనివాస్ లయన్ ఎస్ నాగేందర్ లైన్ వెంకటేశ్వర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , చందు, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.