శేర్లింగంపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

శేర్లింగంపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంతో బైక్ ర్యాలీ, మిఠాయిల పంపకం, బాణసంచా కాలుస్తూ సంబరాలు

వి జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పని చేస్తాం : కాంగ్రెస్ శ్రేణులు

డిసెంబర్ 04, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

తెలంగాణ రాష్ట్రంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా 124ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, అభిమానులు బైక్ ర్యాలీతో పాటు బాణసంచా కాలుస్తూ,ఆ వెలుగుల్లో మిఠాయిలు పంచుతు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేయడంలో తామంతా జగదీశ్వర్ గౌడ్ అన్నతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.