ఆహ్వానం: సంక్రాంతి సంబరాలు మరియు జిల్లా స్థాయి గ్రామీణ క్రీడలు:జిట్టా బాలక్రిష్ణా రెడ్డి

ఆహ్వానం సంక్రాంతి సంబరాలు మరియు జిల్లా స్థాయి గ్రామీణ క్రీడలు: జిట్టా బాలక్రిష్ణా రెడ్డి

ఆహ్వానం

నమస్కారం

స్వామి వివేకానంద జయంతి ,జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువజన సంఘాల సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్వర్యంలో జిట్టా రాధమ్మ ఫౌండేషన్ సహాకారంతో భువనగిరి CSNR ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిన్న ప్రారంభమైన “సంక్రాంతి సంబురాలు మరియు జిల్లా స్థాయి గ్రామీణ క్రీడలలో” భాగంగా జనవరి 13 ఈరోజు మ.3 గం.ల నుండి క్రీడలు ,సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలకు తెలంగాణ ఉద్యమ నాయకులు,కవి గాయకుడు డా. దరువు ఎల్లన్న,తెలంగాణ ధూమ్ ధామ్ – వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు, రేలారే గంగ,నాగ దుర్గ , వర్షిణి తో పాటు ఇంకా ఎందరో విచ్ఛేస్తున్నారు..

కబడ్డీ,వాలీబాల్ ,ఖో ఖో ,గిల్లి దండ ,రింగ్ బాల్ ,తాడు బొంగరం,వనగండ్లు,అష్ట చెమ్మ,పచ్చిస్,తొక్కుడుబిళ్ల,లెమన్ స్పూన్,మ్యూజికల్ చైర్స్,చెస్,క్యారమ్ బోర్డు,పతంగుల పోటీ, ముగ్గుల పోటీ గంగిరెద్దుల అటల్లాంటివి అనేకం ఉన్నాయి.ఈరోజు రాత్రి 10 గం.లకు బోగి మంటలు.. ఇదే నా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ఈరోజు జరిగే గ్రామీణ క్రీడలు మరియు సంక్రాంతి సంబురాలలో మీరు మీ కుటుంబసమేతంగా పాల్గొనాలని కోరుకుంటూ..

Note : జనవరి 14,ఆదివారం ఉ.11 గం.లకు పతంగుల పోటీ,సాయంత్రం 4 గం.లకు ముగ్గుల పోటీ

మీ

జిట్టా బాలక్రిష్ణా రెడ్డి,

యువజన సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, జాతీయ యువజన అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమ నాయకులు.

Leave A Reply

Your email address will not be published.