ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు

వంగవీటి మోహనరంగా ఒక్క సామాజికవర్గానికి చెందిన వాడు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల వెన్నంటి నడిపించిన వ్యక్తి :కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు

 

నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

సామాజిక ఉద్యమ వీరుడు, రాజకీయ దురంధరుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో నూతనంగా ఏర్పాటుచేసిన వంగవీటి రంగా విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రంగా కేవలం ఒక సామాజికవర్గానికి చెందిన నేత మాత్రమే కాదని, బడుగు బలహీన వర్గాల వెన్నంటి ఉండి వారికి అండగా నిలిచారని తెలిపారు. పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. చిరంజీవిగా ఎప్పుడూ ప్రజల గుండెల్లో చిరకాలం జీవిస్తూనే ఉంటారని అన్నారు. వంగవీటి మోహనరంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, CH. భాస్కర్, షౌకత్ అలీ మున్నా, సయ్యద్, అగ్రవాసు, జనార్దన్, రాజుగౌడ్, బాలస్వామి సాగర్, జనార్దన్, కె.శ్రీను, జి.రాంబాబు, ఎన్. సురేష్, సుబ్రహ్మణ్యం, దొరబాబు, సత్యనారాయణ, బి.సురేష్, సతీష్, వినీష్, ఎల్లమ్మబండ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులు, వంగవీటి రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.