Rega Kantha Rao : మల్లారంలో శ్రీ కనకదుర్గ విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
Rega Kantha Rao మల్లారంలో శ్రీ కనకదుర్గ విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మల్లారంలో శ్రీ కనకదుర్గ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న… ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
సెప్టెంబర్ 10, నల్లా సమాచార్ న్యూస్ (భద్రాది కొత్తగూడెం బ్యూరో మూర్తి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలిత ఆలయ పూజారులు సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు, తొలిత స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, వారికి స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ బాటలు వేస్తూ సంక్షేమంలో అభివృద్ధిలో మన తెలంగాణను దేశంలో నెంబర్ వన్ తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరియు అదే విధంగా జిల్లా నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.