మహబూబ్ నగర్ మార్కెట్ లోకి హ్యుందాయ్ కొత్త క్రెటా కారు విడుదల

మహబూబ్ నగర్ మార్కెట్ లోకి హ్యుందాయ్ కొత్త క్రెటా కారు విడుదల

జనవరి 17, నల్లా సమాచార్ న్యూస్ / మహబూబ్ నగర్ : ట్రెండ్ హ్యుందాయ్ కారు షోరూం, మహబూబ్ నగర్ నందు బుధవారం మిడ్ సైజు ఎస్యూవీ అయిన క్రెటాలో కొత్త వర్షన్ ను మహబూబ్ నగర్ జిల్లా రవాణా అధికారి యస్. నరేష్ తో కలిసి షోరూం మేనేజింగ్ డైరెక్టర్ గట్టు గోపాల్ రెడ్డి, డైరెక్టర్లు గట్టు సిరి చందన రెడ్డి, గట్టు హర్షిత్ రెడ్డిలు లాంచనంగా ఆవిస్షరించారు. ఈ సందర్భముగా షోరూం మేనేజింగ్ డైరెక్టర్ గట్టు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మకాల్లో 65 శాతం ఎస్వీయూలే ఉంటాయని భావిస్తున్నామని అలాగే 2030 నాటికి మెుత్తం విక్రయాల్లో విద్యుత్ కార్ల వాటా 20 శాతం సాధించాలని కంపనీ లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. కొత్త క్రెటా కారు ధర రూ. 10.99-19.99 లక్షలు(ఎక్స్ షోరూం). లెవెల్ 2ఏడీఏస్ సేప్టీ సూట్ , 1.5 లీటర్ టర్బోజీడీఐ ఇంజన్ తో వస్తున్న కొత్త క్రెటా ఏడు వేరియంట్లలో లభించనున్నదని తెలిపారు. డీజిల్ వర్షన్ నందు 21 కి.మీ., పెట్రోల్ 18కి.మీ. మైలేజ్ వస్తుందని , 360 డిగ్రీ కెమెరా, 10.25 ఇంచెస్ టచ్ స్కీన్ , బోస్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూందాయ్ కంపనీ మేనేజర్ శివకుమార్, షోరూం సేల్స్ మేనేజర్ హర్షవర్థన్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.