లింకు రోడ్ల ద్వారా ట్రాఫిక్ సమస్యను తగ్గించవచ్చు : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …

లింకు రోడ్ల ద్వారా ట్రాఫిక్ సమస్యను తగ్గించవచ్చు : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …

జులై 08, నల్లా సమాచార్ న్యూస్ / కుత్బుల్లాపూర్ (గోపాల్ రెడ్డి ప్రతినిధి) :

కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి భూదేవి హిల్స్ లో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్  పర్యటించి . ఈ సంధర్బంగా స్థానికులు భూదేవి హిల్స్ హై టెన్షన్ లైన్ మీదుగా నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా భూదేవి హిల్స్, లెనిన్ నగర్ లలో మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ పనులు, విద్యుత్ లైన్ మరమ్మత్తు పనులను చేపట్టాలని ఎమ్మెల్యే  కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ జగద్గిరిగుట్ట ప్రజలకు భూదేవి హిల్స్ మీదుగా నూతన రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా కూకట్ పల్లికి వెళ్లే రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని, కావున ఈ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు వెంటనే వ్యయ ప్రణాళికలు రూపొందించి వీలైనంత త్వరగా పనులను చేపట్టి ప్రజలకు వినియోగంలోకి తేవడంతో పాటు, కాలనీలోనీ విద్యుత్ లైన్ మరమ్మత్తు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తిచేయాలని  అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, నాయకులు ఎత్తరి మారయ్య, విఠల్ ముదిరాజ్, కృష్ణ, సోమయ్య, కె.వి.రాజు, అయోధ్య, యువ నాయకులు జైహింద్, తారా సింగ్,  దాసు, మల్లాచారి, త్రివేణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.