Traffic Awareness:ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Traffic Awareness ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

 

నల్లా సమాచార్ న్యూస్ శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులతో ర్యాలీ చేపట్టిన ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే రోడ్లపై వాహనాలలో ఎలా వెళ్లాలో, సిగ్నల్స్ ఎలా పాటించాలో, ఎలా వెళితే భద్రంగా ఇంటికి వెళ్ళవచ్చునో రోడ్లపై ప్రయాణం చేసినప్పుడు ఏ ఏ నియమాలు పాటిస్తే సురక్షితంగా ఇంటికి వెళ్ళగలుగుతాం. ఫోర్ వీలర్ లో వెళ్ళినప్పుడు విధిగా సీటు బెల్టు ధరించడం, టు వీలర్ లో వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వంటి నియమాలు పాటిస్తే మన ప్రయాణం సురక్షితంగా జరుగుతుందని, ప్రతిఒక్కరూ విధిగా రోడ్డు నియమాలు పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాహనాలపై ప్రయాణం చేస్తున్నప్పుడు మద్యపానం సేవించి కానీ, అజాగ్రత్తగా గాని వెళ్లరాదని వాహనాలలో వెళ్ళినప్పుడు అన్ని పత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, తనిఖీలలో దొరికితే వాహనాల యాజమానులకు శిక్ష పడుతుందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ ఐ, శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ ఆధ్యక్షలు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు రాంచందర్, స్కూల్ స్టాఫ్ & టీచర్స్, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.