తెలంగాణ వేగుచుక్క,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు: రెడ్డి సంఘం తెలంగాణ

తెలంగాణ వేగుచుక్క, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు: రెడ్డి సంఘం తెలంగాణ

సేకరణ సోషల్ మీడియా నుంచి:

తెలంగాణ వేగుచుక్క,మాజీ ముఖ్యమంత్రి,స్వర్గీయ డా.మర్రి చెన్నారెడ్డి గారి జయంతి సందర్బంగా ఘన నివాళులు…💐💐 రెడ్డి సంఘం తెలంగాణ.

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

హైదరాబాద్

చెన్నారెడ్డి గారు జనవరి 13, 1919 న ప్రస్తుత వికారాబాదు జిల్లా, వికారాబాదు తాలూకాలోని సిరిపురం గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి మర్రి లక్ష్మారెడ్డి. ఈయన 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి మరియు విద్యార్థి కాంగ్రెసును స్థాపించారు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత మరియు సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవారు. ఈయన ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించారు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నారు. 1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పని చేసారు.

 

విద్యార్థి దశలోనే నాయకత్వ పటిమ

కలిగిన చెన్నారెడ్డిగారు యంగ్ మెన్ డిబెట్ సొసైటీ,స్టూడెంట్ కాంగ్రేస్,డెమొక్రటిక్ పార్టి

ఆంద్రయువజన సమితి స్థాపించారు.

 

హైద్రాబాద్ స్టేట్ కాంగ్రేస్ లో

కీలకంగా ఉండి జాయిన్ ఇండియా ఉద్యమంలో

కీలక పాత్ర వహించారు.

 

హైద్రాబాద్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బూర్గుల

మంత్రివర్గంలో వ్యవసాయ,పౌర సరపార శాఖలు

నిర్వర్తించారు.

 

భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం కేంద్రం SRC

నియమించింది.కొండావెంకట రంగారెడ్డి,

మర్రి చెన్నారెడ్డి గారు విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు హైదరాబాద్ రాష్ట్రం

ప్రత్యేకంగానే ఉండాలని తమ వాణిని వినిపించారు.

బూర్గుల వర్గం కొంతమంది విలీనాన్ని సమర్థించారు

 

ఆ తర్వాత పెద్దమనుషుల ఒప్పందం తో

1956 నవంబర్ 1లోఆంద్రప్రదేశ్ ఏర్పడింది ఈ ఓప్పందంలో

కొండా వెంకటరంగారెడ్డి ,చెన్నారేడ్డిలు కీలకంగా

వ్యవహరించారు

మొదటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు

ఆయన మంత్రి వర్గంలో కూడ చెన్నారెడ్డి

పనిచేసారు.

 

తర్వాత పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలోతొక్కి

తెలంగాణ పరిరక్షణలను ఉల్లంఘించారు.

అనేక కారణాల వల్ల ప్రత్యేక తెలంగాణ

కాంక్ష ప్రజలలో బలంగా ఏర్పడింది

 

1969 మార్చిలో మదన్ మోహన్ అద్యక్షులుగా

వెంకట్ రామిరెడ్డి కార్యదర్శిగా తెలంగాణ పీపుల్స్ కన్వేన్షన్ ఏర్పడింది.ఉద్యమానికి మొదట విద్యర్థులు నాయకత్వం వహించారు ఉదృతం అయిన తర్వాత

రాజకీయనాయకుల చేతిలోకి వచ్చింది

ఉద్యమ తీవ్రతను గమనించి ఇందిరాగాంధీ

అష్టసూత్రపథకాన్ని రూపొందించింది

దీనితో సంతృప్తి చెందలేదు తెలంగాణ ప్రజలు

తెలంగాణ ప్రజాసమితికి మర్రిచెన్నారెడ్డి గారు

నాయకత్వం వహించారు 1971 సాధారణ ఎన్నికల్లో

ప్రజాసమితి 14స్థానాల్లో పోటి చేసి 11లోక్ సభ స్థానాలు గెలుచుకుని ప్రత్యేక రాష్టృ కాంక్షను

కేంద్రానికి బలంగా వినిపించింది.

 

1972 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనికేంద్రం ప్రజాసమితిని కాంగ్రేస్లో విలీనం చేయాలనీ

తీవ్ర వత్తిడి తెచ్చింది.

చెన్నారెడ్డి వెంట ఉన్న నాయకులను కేంద్రం ప్రలోభ పెట్టింది చెన్నా రెడ్డిని సంప్రదించ కుండానే ఐదుగురు

ఎంపీలు కేంద్రంతో ఒప్పందంకు వచ్చారు

 

అందులో గెలిచిన కొంత మంది విలీనానికి సై అన్నారు అనంతర పరిణామాల వల్ల

ప్రజాసమితి విలీనం అయ్యింది

1971లో ప్రజాసమితి ఉద్యమం నుంచి తప్పుకుంది

నాటీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి ని

తొలగించి తెలంగాణ కు చెందిన పివి నిముఖ్యమంత్రిగా చేసారు

 

చెన్నా రెడ్డి గారు అప్పడు ఏ పదవిలో లేరు అనే విషయాన్ని మిత్రులు గమనించాలి

 

1974 లో ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా నియమించ బడ్డాడు

 

తొలిసారి ముఖ్యమంత్రిగా 1978-80

రెండవ సారి ……. 1989-90

 

రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశారు…

Leave A Reply

Your email address will not be published.