విద్యార్థులు సంపూర్ణ విద్య ద్వారానే దేశంలో అత్యున్నత స్థానాల్లో అవకాశాలు పొందుతారు

సెన్ప్లెక్స్ సెంచరీ మ్యాట్రెస్ సహకారంతో పరుపులు పంపిణీ చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

విద్యార్థులు సంపూర్ణ విద్య ద్వారానే దేశంలో అత్యున్నత స్థానాల్లో అవకాశాలు పొందుతారు.

సెన్ప్లెక్స్ సెంచరీ మ్యాట్రెస్ సహకారంతో పరుపులు పంపిణీ చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

జూలై 11, నల్లా సమాచార్ న్యూస్ / సూర్యాపేట

 

సూర్యాపేట మండలం ఇమాంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్ ఇమాంపేట బాలికల వసతి గృహం విద్యార్థులకు సెన్ ప్లెక్స్ సెంచరీ మ్యాట్రెస్ సహకారంతో పరుపుల పంపిణీ చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

విద్యార్థులు సంపూర్ణ విద్య ద్వారానే దేశంలో అత్యున్నత స్థానాల్లో అవకాశాలు పొందుతారని, ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. సెన్ ప్లెక్స్ సెంచరీ మ్యాట్రెస్ 10 లక్షల రూపాయల విలువైన ఆర్థిక సహకారంతో 100 పరుపులు ఇచ్చారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, వాటర్ ట్యాంకర్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు పాఠశాలకు దాతలు ఏదైనా విరాళంగా ఇస్తే సహాయం చేయాలి అని అన్నారు.

అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కాసరబాద్‌లోని అపూర్వ బదిరుల పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల పరిస్థితులను తెలుసుకున్నారు.

విద్యతోనే సమాన అవకాశాలు లభిస్తాయి అని అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి ప్రతి ఒక్కరు సహకరించాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.