Telangana State రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Telangana State రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు కలిసింది. రాష్ట్ర ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

డిసెంబర్ 26, నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) హైదరాబాద్ : హైదరాబాద్

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉంది, అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం. కాబట్టి, పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని శ్రీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియచేసారు.

ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు:

• తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాము

• కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తాము

• ఫాక్సాకాన్ సంస్థ చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుంది

ఫాక్స్ కాన్ గ్రూప్ గురించి సమాచారం:

• మార్చ్ 2023లో తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్స్ కాన్ గ్రూప్ ఒప్పందం కుదిరింది.

• ఫాక్స్ కాన్ సంస్థ ఆపిల్ ఐఫోన్లను ప్రధానంగా తయారుచేస్తుంది.

• ఫాక్స్ కాన్ సంస్థ ప్రధాన కస్టమర్లలో Google, Xiaomi, Amazon, Hewlett Packard, HUAWEI, Alibaba Group, CISCO, Dell, Facebook, Nentendo, Sony, Microsoft, SEGA, Nokia వంటివి వున్నాయి.

• చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో ఏపీ (శ్రీ సిటి), తమిళనాడు (శ్రీ పెరంబుదూర్), తెలంగాణ (కొంగర కలాన్) మరియు కర్ణాటక (బెంగళూరు సమీపంలో) సంస్థ పనిచేస్తున్నది.

• ఫాక్స్ కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఉపకరణాలు తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఒక లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకున్నది.

• మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25,000 ఉద్యోగాలు కల్పించనున్నది.

 

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said that the Government is committed to the industrial development of the state. A delegation led by Foxconn’s Hon Hai Precision Industry Company Limited representative Mr Lee met the Chief Minister at Dr. B. R. Ambedkar Telangana State Secretariat today. State IT and Industry Sri @Min_SridharBabu, Chief Secretary Smt. Santhi Kumari and others also participated in the meeting.

 

Speaking on the occasion, CM Sri Revanth Reddy said that the newly formed state government has the responsibility to safeguard the aspirations of the people. The government adopted a friendly approach with all communities. On the same lines, the government will also extend full support and cooperation to industrialists. The Chief Minister said that required infrastructure will be provided to promote industrial development besides granting permissions liberally. CM Sri Revanth told the delegation all necessary steps will be taken to promote Telangana as the leader in industrial development in the country.

 

Hon’ble CM Sri Revanth Reddy’s speech points during the meeting with Foxconn delegation:

 

• State Government will expedite the development of Electronics Industry in Telangana

• Government will provide required support for the operations of Foxconn Manufacturing Center at Kongara Kalan.

• State will also extend all necessary support to upcoming projects which are being undertaken by the Foxconn company.

 

Brief details about Foxconn Group:

—————————————

• Foxconn Group entered an agreement with Telangana Government in March 2023.

• Foxconn is manufacturing Apple iPhones.

• Foxconn’s big customers are – Google, Xiaomi, Amazon, Hewlett Packard, HUAWEI, Alibaba Group, CISCO, Dell, Facebook, Nintendo, Sony, Microsoft, SEGA, Nokia.

• Foxconn is operating from 24 countries which includes China, Vietnam, Thailand, Malaysia, America, Europe and India. The company is operating in Sri City (Andhra Pradesh), Sriperumbudur (Tamil Nadu), Telangana (Kongarakalan) and Karnataka (Near Bangalore).

• Foxconn signed a Memorandum of Understanding (MoU) with Telangana government assuring to create one lakh jobs by setting up electronics manufacturing unit.

• In the first phase, the company will provide 25,000 jobs in the next two years.

Leave A Reply

Your email address will not be published.