Telangana Reddy IKC :రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(రెడ్డి ఐకేసీ) పిలుపు

తెలంగాణ రాష్ట్రం

నల్లా సమాచార్ న్యూస్/ హనుమకొండ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) :

రెడ్డి కార్పొరేషన్ సాధన కొరకు తేదీ 19/8/2023 రోజున హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే నిరసన దీక్షకు /ధర్నాకు వేలాదిగా రెడ్లు కదలి రావాలి. ఈరోజు పోస్టల్ కాలనీలోని రెడ్డి సంఘం కార్యాలయంలో రెడ్డి ఐక్య కార్యాచరణ కమిటీ (రెడ్డి ఐకేసీ)హనుమకొండ జిల్లా అధ్యక్షులు అర్జుల కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ 2018లో టిఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెడ్లు అడిగే సమస్య న్యాయమైనదని ,రెడ్లలో కూడా చాలామంది పేదలు ఉన్నారని రెడ్డి కార్పొరేషన్ త్వరలో ఇస్తామని చెప్పినారు.కానీ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు కావస్తున్నది నేటికి చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ప్రకటించలేదు నిధులు కేటాయించలేదు పేద రెడ్ల హక్కుల సాధన కొరకై సభలు, సమావేశాలు,ఆత్మీయ సమ్మేళనాలు చేసి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది.కాబట్టి దీనికి నిరసనగా తేదీ 19- 8-2023 రోజున ఉదయం 10:30 గంటలకు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా జరిగే రెడ్ల నిరసన దీక్ష/ ధర్నాకు వేలాదిగా తరలివచ్చి దీక్షలో/ ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి

 

డిమాండ్లు

1)ప్రభుత్వం వెంటనే 5000 కోట్లతో చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

2)విదేశీ విద్యా నిధి అర్హులైన వారందరికీ వర్తింపజేయాలి

3)ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సక్రమంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలి

4)రెడ్డి గురుకులాలు తగినన్ని ఏర్పాటు చేయాలి.

5)50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు 5000 పెన్షన్ ఇవ్వాలి…

ఇంకా తదితర న్యాయమైన హక్కుల కోసం.

Leave A Reply

Your email address will not be published.