- నవంబర్ 30 న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు
- డిసెంబర్ 3 న ఎన్నికల ఫలితాలు
అక్టోబర్ 09, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సైరన్ మోగింది నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది అలానే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలు కానుంది ఒకే విడతలో తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్లు జరగనున్నాయి. నవంబర్ 10 న నామినేషన్ దాఖలు చివరి తేదీ కాగా, నవంబర్ 13 న నామినేషన్ పత్రాల పరిశీలన నవంబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా నవంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు విడుదల జరుగుతుంది అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.