సుప్రీంకోర్టు లాయర్ జిఎన్ రాజు గంగారం పెద్ద చెరువు ఎఫ్ టీ ఎల్ కు సంబంధించిన స్థలంలో బోర్డు పెట్టడంపై చర్యలు తీసుకోండి

సుప్రీంకోర్టు లాయర్ జిఎన్ రాజు గంగారం పెద్ద చెరువు ఎఫ్ టీ ఎల్ స్థలంలో బోర్డు పెట్టడంపై చర్యలు తీసుకోండి

సుప్రీంకోర్టు లాయరు ‘జిఎన్ రాజు’ గంగారం పెద్ద చెరువు ‘ఎఫ్ టి ఎల్’ కు సంబంధించిన స్థలంలో బోర్డు పెట్టడంపై చర్యలు తీసుకోండి.. మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి నల్ల సంజీవ రెడ్డి.
అవినీతికి ఆమడదూరంలో ఉండే జగదీశ్వర్ గౌడ్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసిన ‘జిఎన్ రాజు’ సుప్రీంకోర్టు న్యాయవాది చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి) శేరిలింగంపల్లి:
సుప్రీంకోర్టు న్యాయవాది ‘జీ ఎన్ రాజు’ పై శేర్లింగంపల్లి చందానగర్ పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ,చందానగర్ సర్కిల్ జిహెచ్ఎంసి కమిషనర్, శేర్లింగంపల్లి మండలం తహసిల్దార్లకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతి శేఖర్ ముదిరాజ్ చేసిన ఫిర్యాదుకు వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా మాజీ డిసీసీ జనరల్ సెక్రటరీ నల్ల సంజీవరెడ్డి డిమాండ్ చేశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పేరుతో గంగారం పెద్ద చెరువు ఎఫ్ టి ఎల్ కు సంబంధించిన భూమిలో ‘జి ఎన్ రాజు’ తప్పుడు సమాచారంతో ఈ బోర్డు ఏర్పాటు చేయడంపై నల్ల సంజీవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరు తలపెట్టినా వారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వదిలిపెట్టరని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.