#Serilingampally : ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

SERILINGAMPALLY ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

డిసెంబర్ 12, నల్లా సమాచార్ న్యూస్ / మియాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయుట ,పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు అందించడం జరుగుతుందని అన్నారు, ఈరోజు మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ బస్టాండు వద్ద శేర్లింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు ,కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళ తో కలిసి మిఠాయిలు పంచి మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ వివరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.