సమాజ సేవే మార్గంగా శ్రీ కృష్ణా యూత్ ప్రతి అడుగు ముందుకు

శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్

సమాజ సేవే మార్గంగా శ్రీ కృష్ణా యూత్ ప్రతి అడుగు ముందుకు వేస్తుంది …

నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతే

శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికం నగర్ లో కృష్ణ యూత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్ సొంత ఖర్చుతో చిన్నారులకు గ్రౌండ్ లో క్రీడా పరికరాలను ఏర్పాటు

 

జూలై 07, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికం నగర్ లక్ష్మీ అపార్ట్మెంట్ సభ్యుల విన్నపం మేరకు కృష్ణ యూత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్ ముందుకు వచ్చి తన సొంత ఖర్చుతో చిన్నారులకు గ్రౌండ్ లో క్రీడా పరికరాలను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు.

నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతే అని,సమాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉంటుందని,శ్రీ కృష్ణ యూత్ 1998సం నుంచి సమాజ నిర్మాణానికి మరియు ప్రజలకు మేలు చేసే విధంగా శ్రీ కృష్ణ యూత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వ్యవస్థాపకులు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.