Sherlingampally : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే మా ప్రధాన ఎజెండా : ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే మా ప్రధాన ఎజెండా : అరెకపూడి గాంధీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్

హఫీజ్ పేట్, మాధాపూర్ డివిజన్ల అభివృద్ధే మా లక్ష్యం: వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్లు

 

సెప్టెంబర్ 14, నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం : 

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్దే ప్రధాన ఎజెండాగా పనులు పూర్తి చేస్తాం అరెకపూడి గాంధీ ,ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసనసభ్యులు..

హఫీజ్ పేట్, మాధాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్దే లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు సాగుతం శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్.. రాజారామ్ కాలనీ, మాధాపూర్ డివిజన్. హుడా కాలనీ, హాఫీజ్ పెట్ డివిజన్ హాఫీజ్ పెట్ మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,గౌరవ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ కి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డికి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ కి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హాఫీజ్ పెట్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్.

ఈరోజు హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారామ్ కాలనీ అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ మరియు హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్ అధికారులు డి.జి.ఎం నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరి తో కలిసి నూతనంగా మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, బస్తీ కమిటీ సభ్యులు,ప్రజలు,మహిళలు,యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.