జోనల్ కమీషనర్ ను కలిసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

జోనల్ కమీషనర్ ను కలిసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

జులై 02, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :


శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉపేందర్ రెడ్డి ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి అభినందనలు తెలియజేసారు.

కార్పొరేటర్ తో పాటుగా మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కృష్ణ రెడ్డి ఉన్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమీషనర్ తో చర్చించామని అన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా జోనల్ కమీషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరతగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.