శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం, బస్తి/కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం, బస్తి/కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

నేడు మనం చేసే పనులు రాబోయే తరాలకు మేలు జరిగేలా ఉండాలి

గెలుపోటములకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటా

జూలై 07, నల్లా సమాచార్ న్యూస్ / గచ్చిబౌలి డివిజన్ :

గచ్చిబౌలి డివిజన్ నవోదయ కాలనీ అసోసియేషన్ సభ్యులతో కాలనీలో ఉన్న పార్కులు, మౌళికవసతుల అభివృద్ధిపై పాదయాత్ర నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.. నేడు మనం చేసే పనులు రాబోయే తరాలకు మేలు జరిగేలా ఉండలని,నా దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగేలా చూస్తానని తెలిపారు. గెలుపోటములకు అతీతంగా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం ఉంటుందని మరో సారి స్పష్టం చేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మనేపల్లి సాంబశివరావు,సురేష్,భారత్,జయద,వినయ్ కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.