శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ నాయకురాలు శిరీష సత్తూర్

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ నాయకురాలు శిరీష సత్తూర్

మన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ అరికిపూడి గాంధీ గారు నిన్న జిహెచ్ఎంసి మీటింగ్లో కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ నాయకులు గురించి వాడిన ఆ పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాలలో జిహెచ్ఎంసి పరిధిలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన గాని, ఆయన కార్పొరేటర్స్ గాని బహిరంగ చర్చికి సిద్ధమా అని నేను ప్రశ్నిస్తున్నాను?

 

కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి తోడుగా ఉండాలని, అభివృద్ధి జరగాలని ప్రజలు రెండుసార్లు రాష్ట్రంలోనూ మరియు జిహెచ్ఎంసి లోను టిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఇచ్చి అధికారం కట్టుపెట్టారు కానీ జరిగిందేంటి?

 

ఒక ఇంటర్నల్ రోడ్ సరిగ్గా లేదు, ఎక్కడ చూసినా నాళాలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే ఏ చెరువు చూసిన పేరుకే సుందరీకరణ అన్నారు కానీ ఎక్కడపడితే అక్కడ చెరువు కబ్జాలు అయితే జరిగాయి, ఇంకా జనాలు దోమలతో వేగలేక ఎన్నోసార్లు ఎన్నో ఏరియాల్లో ఎమ్మెల్యే గారిని మరియు కార్పొరేటర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ జరిగింది శూన్యం, అందుకే ఈసారి వాళ్లు కాంగ్రెస్ నాయకులని, పార్టీని నమ్మారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో అధికారం ఇచ్చారు. మా నాయకులు చేసిన మంచి పనులు చూసి తట్టుకోలేక ఇలా అక్కరలేని మాటలు అంటున్నారు.

 

రాష్ట్రంలోకి వచ్చేసాం, ఇంక నెక్స్ట్ ఈజ్ జిహెచ్ఎంసి.

 

– శ్రీమతి శిరీష సత్తూర్,

కాంగ్రెస్ మహిళా నాయకురాలు.

Leave A Reply

Your email address will not be published.