శేరిలింగంపల్లి ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్

ప్రజా పాలనను చూసి ఓర్వలేక నిప్పులు కక్కుతున్న ఎమ్మెల్యే గాంధీ
సోమవారం నాడు జరిగిన నగర కౌన్సిల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అభివృద్ది నిధులపై కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు కక్కడం చూస్తే గుమ్మడికాయ దొంగ కథ గుర్తుకొస్తుంది. అభివృద్ది అస్తవ్యస్థంగా ఉండడానికి కారణం గత పది సంవత్సరాలుగా శేరిలింగంపల్లికి తాను ఎమ్మెల్యే గా ఉండడమే అనేది ప్రజలకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 10 సంవత్సరాలు ఆయనకు చేతగాని పనిని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేయడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లో నే ప్రభుత్వ పని తీరును చూసి ప్రజల్లో ప్రజాపాలన స్పందనను చూసి ఎమ్మెల్యే గారికి గుండెల్లో గుబులు పుట్టుకొచ్చింది. డివిజన్ కి సంబంధం లేని నాయకులు అని వక్రీకరిస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు పేద ధనికులు అని తేడా లేకుండా అందరినీ దగ్గర తీసుకొని ప్రజల సమస్యను పరిషరించే దిశగా అడుగులు వెస్తుండడం చూసి ఓర్వలేక నోరు పారేసుకుంటే సహించం. పేద ప్రజలను మరియు స్లమ్స్ ని దూరం పెట్టింది ఈ ఎమ్మెల్యేనా? కాదా! అన్నది డివిజన్ ప్రజలకు బాగా తెలుసు.. *ప్రజలు దొరల పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని గట్టిగా విశ్వసిస్తున్నారు.* రాబోయే లోక్సభ ఎన్నికల్లో డివిజన్ లో భారీ మెజారిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాను.

ఇట్లు
పట్వారి శశిధర్
సీనియర్ నాయకులు
124 డివిజన్, కాంగ్రెస్ పార్టీ

Leave A Reply

Your email address will not be published.