శేరిలింగంపల్లి నియోజకవర్గం BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు

Nalla Samachar News ( Nalla Sanjeeva Reddy 9849396606):

మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుబాష్ చంద్రబోస్ నగర్ బిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ముక్తర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు..

 

కాంగ్రెస్ పార్టీలో చేరిన బస్తి అధ్యక్షులు మరియు బస్తీ సభ్యులు,కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని బస్తి/కాలనీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంచి వ్యక్తి సేవ గుణంగల నేత జగదీశ్వర్ గౌడ్ అన్నకు తోడుగా అడుగులు అడుగై ముందుకు నడుస్తామని కార్యకర్తలు తెలిపారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాట్లాడుతూ.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుందని,ప్రజా పాలనకు నిదర్శనంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు,మహాలక్ష్మి పథకం రైతు భరోసా,గృహలక్ష్మి,యువ వికాసం,వృద్ధులకు,వికలాంగులకు చేయూత,6 గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీగా మీ అందరికీ తెలుసా అని కాంగ్రెస్ పార్టీతోనే అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.

 

ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు సయ్యద్ గౌస్,నియోజకవర్గ నాయకులు మహిపల్ యాదవ్,మాదాపూర్ కాంటెస్టడ కార్పొరేటర్ నగేష్ నాయక్,మునఫ్ ఖాన్,ఇస్మాయిల్,సాజిద్,జఫ్ఫార్,ఆనంద్ సింగ్,మహేష్,మెయిన్,మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.

 

#jagadeeshwargoud #serilingampallyconstituency #jagadeeshwargoudanna #serilingampally #assembly #incharge #serilingampallycongress #madhapur #subashchandrabosenagar #CongressParty #Joining #program

Leave A Reply

Your email address will not be published.