శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వి జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు
-హైదర్ నగర్ దేవాలయంలో పూజలు నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ
-ప్రజల ఆశీర్వాదం వారి దీవెనలతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది
-శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తం : జగదీశ్వర్ గౌడ్
నవంబర్ 09, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు శేలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం శేర్లింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వి జగదీశ్వర్ గౌడ్ ధీమా శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి జగదీశ్వర్ గౌడ్ గురువారం నామినేషన్ అట్టహాసంగా దాఖలు చేశారు. ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి వి జగదీశ్వర్ గౌడ్ హైదర్ నగర్ దేవాలయంలో పూజలు నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరగా పొడవు దారి పొడవునా జగదీశ్వర్ గౌడ్ కు పార్టీ శ్రేణులు మహిళలు మంగళహారతులతో గజమాలలతో, పూలమాలలతో, స్వాగతం పలికారు ఈ సందర్భంగా అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ హైదర్ నగర్ లోని విజయదుర్గ మైసమ్మ టెంపుల్, గంగారంలోని హనుమాన్ దేవాలయం, తారానగర్ తుల్జా భవాని మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ప్రజల ఆశీర్వాదం వారి దీవెనలతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని గెలుస్తుందని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
తన నామినేషన్ సందర్భంగా ర్యాలీలో పాల్గొని తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాలవారు, పార్టీ శ్రేణులు, అభిమానులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.