సంక్షేమం పేరుతో సంక్షోభ పాలనను సాగించిన బిఆర్ఎస్: కప్పాటి శివరామకృష్ణా రెడ్డి

సంక్షేమం పేరుతో సంక్షోభ పాలనను సాగించిన బిఆర్ఎస్: కప్పాటి శివరామకృష్ణా రెడ్డి

 

 

సంక్షేమం పేరుతో సంక్షోభ పాలనను సాగించిన బిఅర్ఎస్ :కప్పాటి శివరామకృష్ణా రెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి) హైదరాబాద్.

ఆదివారం మహేశ్వరం మండల కేంద్రములో విలేకరుల అందజేసిన ఒక ప్రకటనలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మీడియా విభాగం సంయుక్త సమన్వయకర్త కప్పాటి శివరామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం పేరుతో బిఅర్ఎస్ ప్రభుత్వం సంక్షోభ పాలనను సాగించి గురువింద రీతి నీతి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు

సంక్షేమం పేరుతో సంక్షోభ పాలనను సాగించింది అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులని పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇవ్వాలని అడగడం గురువింద రీతిగా వుందని అన్నారు. బిఅర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు దళిత బందు,దళిత ముఖ్యమంత్రి,దళితులకు మూడు ఎకురాలు, నిరుద్యోగ భృతి, రెండుపడకల గదలు, బిసిబందు, గిరిజన బందు గృహలక్ష్మి అనేక హమీలు ఎందుకు అమలు చేయలేదో ముందు ప్రజలకు తెలయ జేయాలని ఆ తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల మీద మాట్లాడలని అన్నారు.

పదేళ్లుగా గుర్తుకురాని హామీలు గత ఎన్నికల ముందు అడావిడిగా సంక్షేమం పేరుతో అర్హులకు మొండిచేయి చూపించి అనర్హలకు అందించారని ఎన్నికల ముందు ఓటర్లను మభ్యపెట్టి అభివృద్ధి పేరుతో అనేక శంకుస్థాపనలు చేసి గెలిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందు వాటిని పూర్తి చేయాలని సూచించారు.

బిఅర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ సంక్షేమం పథకాల పేరుతో రాష్ట్రంలో దోపిడీ చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు.

మోసాలు చేయడంలో అబద్దాలు మాట్లాడడంలో అవినీతి,ఆక్రమణల బిఅర్ఎస్ నాయకులకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని అన్నారు.

గత బిఅర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకువెళ్ళినా,అప్పుల రాష్ట్రంగా మార్చినా ఆరు నూరైనా ఆరు గ్యారంటీ పథకాలని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, అధికారం లోకి వచ్చిన నెల లోపే ఆరు గ్యారంటీలో కొన్నిటిని ఇప్పటికే అమలు చేస్తూ ప్రజా అభిమానాన్ని చూరగొన్నాము అని అన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఎన్ని అసత్య ఆరోపనలు చేసిన ఆబాండాలు మోపిన తెలంగాణ ప్రజలు బిఅర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరని అన్నారు.

ధన్యవాదములతో…

తమ విశ్వసనీయ

కప్పాటి శివరామకృష్ణా రెడ్డి

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మీడియా విభాగం సంయుక్త సమన్వయకర్త

Leave A Reply

Your email address will not be published.