455 పెండింగ్ పనులు

మార్చిలోపు పూర్తి చేయండి :అధికారులకు జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి ఆదేశం

455 పెండింగ్ పనులు

మార్చిలోపు పూర్తి చేయండి

-వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

-అధికారులకు జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి ఆదేశం

-సాంఘీక సంక్షేమం, పనుల కమిటీలపై సమీక్ష

ఫిబ్రవరి 26, నల్లా సమాచార్ న్యూస్ / వికారాబాద్ : జిల్లాలో పెండింగ్ లో ఉన్న 455 పనులు మార్చి 31లోపు పూర్తి చేయాలని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లాపరిషత్ కార్యాలయంలో  పనులు, సాంఘీక సంక్షేమం స్టాండింగ్ కమిటీలపై సునీతారెడ్డి సమీక్ష చేశారు. జిల్లా పరిషత్ కింద రూ.14 కోట్లతో మంజూరు చేసిన 428 పనులు, 15 ఆర్థికసంఘం నుంచి రూ.4.87 కోట్లు విలువ చేసే 156 పనుల్లో ఇంకా 27 పనులు నేటికి పెండింగ్ ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. వచ్చే మార్చి చివరి నాటికి ఎట్టిపరిస్థితుల్లో పనులు పూర్తికావాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అర్దబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. అంతకు ముందు సాంఘీక సంక్షేమంపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సుధీర్, జడ్పిటీసీలు శ్రీనివాస్ రెడ్డి, ధారసింగ్, సంతోష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.