EWS రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయండి:

ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నల్ల సంజీవరెడ్డి 

EWS రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయండి:

ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నల్ల సంజీవరెడ్డి 

జనవరి 08, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో మరియు EWS రిజర్వేషన్లు వర్తించే అన్ని కేంద్ర,రాష్ట్ర సంస్థల్లో పేద రెడ్డి, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య, కమ్మ, క్షత్రియ ఇంకా EWS రిజర్వేషన్లు వర్తించే అన్ని సామాజిక వర్గాల వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నల్ల సంజీవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలో ఇప్పటివరకు సక్రమంగా అమలు కావడం లేదని అన్ని విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన EWS రిజర్వేషన్లను సక్రమంగా అమలయ్యేలా చూడాలని EWS Welfare Association అధ్యక్షులు నల్ల సంజీవరెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.