రాష్ట్ర ముఖ్యమంత్రి కి చెప్పు చూపించడం ఇది మీ ఆహంకారానికి నిదర్శనం

రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సంజీవరెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి కి చెప్పు చూపించడం ఇది మీ ఆహంకారానికి నిదర్శనం…

బాల్క సుమన్ మాట్లాడిన మాటలు వెంటనే వెన్నకి తీసుకోవాలి..

రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సంజీవరెడ్డి

ఫిబ్రవరి 06, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల రెడ్డి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేట్లు ఉంది అని అన్నారు. బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలి అని. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషించడం సరి కాదని రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసుకోవచ్చు.. కానీ ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో దొరలకు నిన్నటి వరకు ఊడిగం చేసిన బాల్క సుమన్ తన ఓటమిని తట్టుకోలేక ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకంగా మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో చె..తో కొడతానని చె..ను ఎత్తి చూపడాన్ని రెడ్డి సామాజిక వర్గం తీవ్రంగా పరిగణిస్తుంది…ఇలాంటి సంఘటనలను బీఆర్ఎస్ పార్టీ అదుపులో పెట్టకపోతే రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతుంది… అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు గుణపాఠం బీఆర్ఎస్ పార్టీకి చెప్పినప్పటికీ నాయకుల తీరులో మార్పు రాకపోవడం దురదృష్టకరం.. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలాంటి దుర్భాషలకు దిగకుండా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చర్యలు తీసుకోకపోతే తప్పకుండా రెడ్డి సామాజిక వర్గం నుండి ఎదురుదెబ్బ తప్పదు అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.