తస్మాత్ జాగ్రత్త బాల్క సుమన్: రెడ్డి సంఘం తెలంగాణ

ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలి :రెడ్డి సంఘం తెలంగాణ డిమాండ్

తస్మాత్ జాగ్రత్త బాల్క సుమన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన పౌరుష పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలి “రెడ్డి సంఘం తెలంగాణ” డిమాండ్.

 

ఫిబ్రవరి 06, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల రెడ్డి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని రెడ్డి సంఘం తెలంగాణ నాయకులు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపించడం ఇది మీ అహంకారానికి నిదర్శనం ..ఒక మాజీ ఎమ్మెల్యే అయిన బాల్క సుమన్ చర్యలను “రెడ్డి సంఘం తెలంగాణ ” తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ మాటలను  వెంటనే వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని రెడ్డి సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తునట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని బిఆర్ఎస్ నాయకత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.