Reddy : రెడ్డి సంక్షేమ సంఘం-కొన్నే ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

రెడ్డి సంక్షేమ సంఘం-కొన్నే వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

సెప్టెంబర్ 24, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలోని శివాలయం లో రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని అందరిపై స్వామివారి కృప ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో రెడ్డి సంఘం పెద్దలు పాల్గొనడం జరిగింది.

 

Leave A Reply

Your email address will not be published.