రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేసిన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు: పాలమూరు రెడ్డి సేవా సమితి

నల్లా సమాచార్ న్యూస్:

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తరపున గురువారం రాజా బహదూర్ రెడ్డి కన్వెన్షన్
సెంటర్ కార్యాలయమునందు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తూము ఇంద్ర సేనా రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశములో రెడ్డి కార్పోరేషన్ ప్రకటించిన తెలంగాణ రాష్టప్రభుత్వానికి ధన్యవాదాలు
తెలుపుతూ తీర్మాణము చేయడము జరిగినది. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా 33 జిల్లాలలో పేదరెడ్ల పోరాటాన్ని గర్తించి తమ మ్యానిఫెస్టోలో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాబినెట్ సమావేశములో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు వారి క్యాబినెట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు. చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేసి పేద రెడ్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
22 వ వార్షికోత్సవం:
అలాగే 17వ తేది, ఆదివారము పాలమూరు రెడ్డి సేవా సమితి 22 వ వార్షికోత్సవాన్ని రెడ్డి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నామని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్డి బంధువులు అధిక సంఖ్య
లో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమం
లో ప్రధాన కార్యదర్శి వేపూరు రాజేందర్ రెడ్డి, కోశాధికారి మల్లు నరసింహా రెడ్డి, ఉపాధ్యక్షులు జి. వెంకట్రామ్ రెడ్డి, కార్యదర్శి యు. కోటేశ్వర రెడ్డి గౌరవ సలహాదారు పోతుల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.