ఆచార్య కోదండరామ్ పై తమ అక్కసును ప్రదర్శించించడం తగదు : జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి

తెలంగాణ ఉద్యమకారులను పొమ్మనలేక పొగపెట్టిన పార్టీ తెరాస 

ఆచార్య కోదండరామ్ పై తమ అక్కసును ప్రదర్శించించడం తగదు : జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి

తెలంగాణ ఉద్యమకారులను పొమ్మనలేక పొగపెట్టిన పార్టీ తెరాస 

జనవరి 27, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ : రాజకీయ జెఎసి ఛైర్మన్ గా టిఆర్ఎస్ అధ్యక్షుడికి సహచరుడుగా, సమ ఉజ్జీగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సకలజనులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనదైన ముద్ర వేశిన ఆచార్య కోదండరామ్ పై తమ అక్కసును ప్రదర్శించించడం తెలంగాణ ఉద్యమ నేతలపై ఉన్న చులకన భావనను తెలియజేస్తుంది అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. కోదండరామ్ ను తమ కోటా శాసనమండలి సభ్యునిగా ఆమోదిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళ సై తీసుకున్న నిర్ణయాన్ని పక్షపాత వైకరంటూ కేటీఆర్ నిందించడం ఉద్యమ నాయకులు, ఉద్యమకారుల పట్ల కెసిఆర్, కేటీఅర్ ఉన్న అక్కసును, దాసోజీ శ్రవణ కుమార్ పట్ల వున్న కపట ప్రేమను తెలియజేస్తుంది అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించినా దాసోజీకి అధికారం వున్న తొమ్మిది సంవత్సరాలు గుర్తుకు రాని ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎందుకు గుర్తుకు వచ్చాడు. అంతకుముందు ఎమ్మెల్సీగా ఎందుకు అవకాశం కల్పించలేక పోయారు. ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన మీరు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి వోట్లు పొందడానికి చేసిన డ్రామా అని ప్రజలకు తెలుసునని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి అధికారం లోకి రాగానే మీ అవినీతి, అసమర్థత, దళారీ పాలనును ఎక్కడ ప్రశ్నిస్తారో అని ఉద్యమ కారులను ఇంటికి పంపే ప్రయత్నం చేసింది నిజము కాదా, పొమ్మనలేక పొగపెట్టిన మాదిరిగా ఉద్యమకారులను ఉద్యమద్రోహులతో కలసి అవమాన పరిచింది మీరుకారా, ఉద్యమ నాయకులకు కనీసగౌరవం లేని పనికిరాని పదవులు ఇచ్చి వారికి ఏదో చేసామని గొప్పలు చెప్పుకుంది మీరుకారా, తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానలను మరిచి ఉద్యమ ద్రోహులతో కలసి రాష్ట్రాన్ని దివాలా తీయించి తెలంగాణ ప్రజలని, ధగా చేసింది మీరు కారా అని పాండురంగా రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌కు సమవుజ్జీగా నిలబడే నాయకుడు తెలంగాణా సాధన కోసం మీతో కలిసి పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్ అని మీరు గౌరవించలేకపోగా వారిపట్ల ద్వేషభావం కలిగి ఉండడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.