ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా చూస్తాం:వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా చూస్తాం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా చూస్తాం.:.వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం.

######################

గోకుల్ ప్లాట్స్,మాదాపూర్ డివిజన్

######################

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని,ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని తెలిపారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ నందు ఏర్పాటు చేసిన చేసిన ప్రజా పాలన కేంద్రంలో పర్యటించి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.

 

ప్రజాపాలన కేంద్రాలలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను సంబందించిన అన్ని రకాల ఫార్మలు అందుబాటులో ఉంచి,వాటికీ సంబందించిన అధికారులు,మా సిబ్బంది కూడా అందుబాటులో ఉంటూ,ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని.ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,గృహ జ్యోతి,చేయూత గ్యారంటీల లబ్దికొరకు అప్లై చేసుకోవాలని కోరారు.

 

మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.2500 ఆర్థిక సహాయం,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌‌,ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేనివారికి ఇంటి స్థలం,5 లక్షల రూపాయల సాయం,ఉద్యమకారులు,అమరవీరుల కుటుంబాలకు 250 చదరపుగజాల ఇంటి స్థలం,గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్,చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయల పింఛన్ మరియు దివ్యాంగులకు 6000 రూపాయల పింఛన లబ్దికొరకు అప్లై చేసుకోవచ్చు.

 

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నాగేశ్వరరావు,శ్రీను,సత్యం,వీర రెడ్డి,ప్రేమ,మహిళలు లక్ష్మీ,వినిత,శ్రావణి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.