ప్రజాకలలను ముందు తరాలకు అందించటమే నిసార్ కు నిజమైన నివాళి

ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు -- కురిమిద్ధ శ్రీనివాస్

ప్రజాకలలను ముందు తరాలకు అందించటమే నిసార్ కు నిజమైన నివాళి

ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు — కురిమిద్ధ శ్రీనివాస్

జులై 08, నల్లా సమాచార్ న్యూస్ / కుత్బుల్లాపూర్ ( గోపాల్ రెడ్డి ప్రతినిధి ) :

 

ప్రజా వాగ్గేయకారుడు నిసార్ 4వ వర్ధంతిని  ఆరుట్ల రామచంద్రారెడ్డి భవన్ సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రజానాట్యమండలి అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్,శాంతి సంఘం నాయకులు కిషన్ రావు,అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు బైరాగి మోహన్,రాష్ట్ర సిపిఐ నాయకులు ఏసురత్నాం,మండల కార్యదర్శి ఉమా మహేష్,తెలంగాణ ఉద్యమ కళాకారుడు మాపల్లె శంకర్,స్థానిక నాయకులు రషీద్,లు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిసార్ నేడు మన మద్యలో లేక పోయినా వారి సాహిత్యం ఎల్లవేళలా మనకు దిక్సూచి లా వుంటుందని,నిసార్ ఒక నిస్వార్థ ప్రజాసమస్యలపై తన కలాన్ని ఎక్కుపెట్టిన కవి,సమాజంలో ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న సమస్యలను తన కలం ద్వారా తెలిపిన ఒక సర్వసాధారణమైన భాషలో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది.నిసార్ తలచిన కులమత విద్వేషాలు లేని,దేశమిదొక దేశం యుద్ధం చేయని,ప్రజల ఆస్తులను రక్షణ ఉండాలని,ప్రపంచ శాంతికి నిరతం పయనించిన తన కాలానికి గాలానికి నిజమైన నివాళి ఇవ్వాలంటే వారి ఆశయాలను ముందు తరాలకు అందించటమే నిజమైన నివాళి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదశి ప్రమీల,మండల కార్యదర్శి భాస్కర్,కృష్ణ,క్రాంతి కలా బృందం అధ్యక్షులు వెంకటా చారి,నాయకులు రాములు, బాబు, వంగరి సినివాస్,యాకుబ్,నర్సయ్య,సహదేవ్ రెడ్డి,హరినాథ్ రావు,సుధాకర్ గౌడ్,రాంచంద్రారెడ్డి,ఇమామ్,మహిళా సమాఖ్య అధ్యక్షులు హైమావతి, సైదమ్మ,బాపిరాజు,రాములు,సామ్యూల్, ముసలయ్య,తదితరులు సుమారు రెండొందల మంది నిసార్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.