ఖాళీగా ఉన్న రేషన్ షాపులను భర్తీ చేయండి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరమేశ్వర్ రెడ్డి వినతి

ఖాళీగా ఉన్న రేషన్ షాపులను భర్తీ చేయండి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరమేశ్వర్ రెడ్డి వినతి

నల్లా సమాచార్ న్యూస్ / ఉప్పల్ :

ఉప్పల్ నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న రేషన్ షాపులను భర్తీ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి కోరారు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న రేషన్ షాపులను సైతం అర్హులైన డీలర్లతో సకాలంలో పూర్తి చేయకపోవడంతో వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్టుగా గుర్తు చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరమేశ్వర్ రెడ్డి కలిసి ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి వివరించారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న రేషన్ షాపులకు డీలర్లు లేరని, జనాభాకు అనుగుణంగా కొత్తగా రేషన్ షాపుల సంఖ్యను కూడా పెంచాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.