పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించండి కేంద్ర జల్ శక్తి మంత్రిని కోరిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రాజెక్టు హోదా కల్పించండి:జల్ శక్తి కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

Hon’ble Chief Minister Sri Revanth Reddy and Irrigation Minister Sri Uttam Kumar Reddy met Jal Shakthi Minister Sri Gajendra Singh Shekhawat ji in New Delhi today.

పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా క‌ల్పించాల‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి శ్రీ గజేంద్ర‌సింగ్ షెకావ‌త్‌కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జ‌ల్‌శ‌క్తి మంత్రి శ్రీ షెకావ‌త్‌ను ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి శ్రీ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ఈరోజు సాయంత్రం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి, నీటి పారుద‌ల శాఖ మంత్రి పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్య‌త‌ను కేంద్ర మంత్రికి వివ‌రించారు. క‌ర‌వు, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగ‌ర్‌క‌ర్నూల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వికారాబాద్‌, నారాయ‌ణ‌పేట, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల నుంచి సాగునీరు ఇవ్వాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ ప్రాజెక్టు నుంచి ఆరు జిల్లాల ప‌రిధిలోని 1226 గ్రామాల‌తో పాటు హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి తాగు నీరు స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంద‌న్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు అనుమ‌తులు తీసుకున్నా ఇంకా హైడ్రాల‌జీ, ఇరిగేష‌న్ ప్లానింగ్‌, అంచ‌నా వ్యయం, బీసీ రేషియో, అంత‌రాష్ట్ర అంశాలు కేంద్ర జ‌ల సంఘం ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని, వాటికి వెంట‌నే ఆమోదం తెల‌పాల‌ని కోరారు. ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ఇవ్వాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రిని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నీటి పారుద‌ల శాఖ మంత్రి శ్రీ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.