పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో విశ్వకవి శ్రీ యోగి వేమన జయంతోత్సవం

పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో విశ్వకవి శ్రీ యోగి వేమన జయంతోత్సవం

పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో విశ్వకవి శ్రీ యోగి వేమన జయంతోత్సవం

—————————————నల్లా సమాచార్ న్యూస్ :(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)          ——

“విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగువారు ఉండరు. శ్రీ యోగి వేమన గారు ప్రజాకవి, సంఘసంస్కర్త. వానకు తడవని వారు, వేమన పద్యం రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అటువంటి మహనీయుని జన్మదినమును తెలుగుప్రజలందరూ జ్ఞాపకం చేసుకొని, స్మరించుకునే విధంగా “పాలమూరు రెడ్డి సేవా సమితి” ప్రతి సంవత్సరం జనవరి 19 న ఆ మహనీయుని జన్మదినం జరుపుతుంది. శుక్రవారం పాలమూరు రెడ్డి సేవా సమితి రెడ్డి కన్వెన్షన్ సెంటర్ నందు శ్రీ యోగి వేమన జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తూము ఇంద్రసేనా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ యోగి వేమన విగ్రహానికి న్యాయవాది ఎస్. మల్లారెడ్డి , ఎన్. జి. ఓ.’ స్ మాజీ అధ్యక్షులు జి. రాజేందర్ రెడ్డి పూలమాల అలంకరించి నివాళులర్పించినారు. అనంతరం జరిగిన సభలో యోగి వేమన గురించి పట్లోళ్ల లక్ష్మారెడ్డి, మద్ది అనంత రెడ్డి, పొద్దుటూరి ఎల్లా రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వేపూర్ రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జి. వెంకట్రామ్ రెడ్డి, ప్రచార కార్యదర్శి ఎన్. సురేందర్ రెడ్డి, కార్యదర్శులు టి.పరమేశ్వర్ రెడ్డి, యు. కోటేశ్వర్ రెడ్డి, మహిళా విభాగం కార్యదర్శి స్వరూప, ఉపాధ్యక్షులు వనజ, సునీత కోశాధికారి శోభ, కవిత మరియు సేవా సమితి సలహాదారు పోతుల రాఘవ రెడ్డి, ఎం. ప్రభాకర్ రెడ్డి, మద్ది యాడి రెడ్డి, శివా రెడ్డి, మద్ది కృష్ణా రెడ్డి, బాలగంగాధర్ రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.