OXFORD SCHOOLS 25th ANNUAL SPORTS MEET 2023-2024 కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

OXFORD SCHOOLS 25th ANNUAL SPORTS MEET 2023-2024 కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి :

OXFORD SCHOOLS 25th ANNUAL SPORTS MEET 2023-24 కార్యక్రమంలో..ముఖ్య అతిధులుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

రామచంద్రాపురం BHEL లోగల హాకీ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన OXFORD I.I.T. & MEDICAL FOUNDATION స్కూల్స్ తారానగర్ బ్రాంచ్ వారు ఏర్పాటుచేసిన 25th స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు. వారితో పాటుగా శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటి ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా OXFORD SCHOOL విద్యార్థులు ముఖ్య అతిధులుగా విచ్చేసిన కార్పొరేటర్ గారిని మార్చ్ ఫస్ట్, గౌరవ వందనం చేస్తూ వేదిక మీదకు సాధరంగా స్వాగతించారు. అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు స్పోర్ట్స్ మీట్ ను (ఒలింపిక్) ఫైర్ ను వెలిగించి, బలూన్స్ ను ఆకాశానికి విడిచి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్ లో భాగంగా రన్నింగ్ రేస్ లో మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా గెలుపొందిన విద్యార్థులకు కార్పొరేటర్ గారు గోల్డ్ మెడల్స్ ను ప్రధానం చేశారు. రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ..స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని విద్యార్థులతో ప్రతిఒక్క విద్యార్థి కి చదువుతో పాటుగా స్పోర్ట్స్ చాలా ముఖ్యమని అన్నారు. విద్యార్థులందరు క్రమశిక్షణతో ఉండి చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు కార్పొరేటర్ గారిని ఘనంగా శాలువాతో సత్కరించి, మెమెంటో ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ SK మాలిన్, రీజినల్ ఇంచార్జి ఆరోగ్య రెడ్డి, మానేజ్మెంట్ స్టాఫ్ బార్బర మెహెతా, ప్రీ ప్రైమరీ ఇంచార్జి నస్రీన్, ప్రైమరీ ఇంచార్జి స్వాతి, సీనియర్ ఇంచార్జి ప్రశాంతి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, అజీమ్, సుభాష్ రాథోడ్, విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.