ఓల్డ్ ఎంఐజిలో మహిళా దినోత్సవ వేడుకలు హాజరైన పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్

ఓల్డ్ ఎంఐజిలో మహిళా దినోత్సవ వేడుకలు హాజరైన పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి లోని భారతి నగర్ డివిజన్, ఓల్డ్ ఎంఐజీ లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధి గా పాల్గొన్నారు హాఫీజ్పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు.

నల్లా సమాచార్ న్యూస్:- (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు పెద్ద పీట వేస్తూ మహాలక్ష్మి, గృహలక్ష్మి వంటి పథకాలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపే అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందని పేర్కొన్నారు పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు. తెలంగాణ ఆడపడుచులను లక్షాధికారులను చేయడమే లక్షంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడం శుభసూచికం అని తెలిపారు.

 

#womensdaycelebration #serilingampallyconstituency #Bharatinagar #mig #ChiefGuest #hafeezpet #Corporator #poojithajagadeeshwargoud #congressgovernment #FulfillingDreams #womensrights

Leave A Reply

Your email address will not be published.