నూతనంగా చేపడుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించిన కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నూతనంగా చేపడుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించిన కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్

 

 

నూతనంగా చేపడుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించిన…శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)

అనంతరం కార్పొరేటర్ గారు శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్, నెహ్రు నగర్ లలో పాదయాత్ర నిర్వహించి, ప్రజలతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు

 

ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ..గోపినగర్, నెహ్రు నగర్ లలో మరిన్ని అభివృద్ధి పనులను చేపడుతామని, ఈ డ్రైనేజీ పైప్ లైన్ వేయడంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్య తీరనుందని తెలిపారు. అలాగే డ్రైనేజీ పైప్లైన్ వేసిన వెంటనే దానిపై రోడ్డు నిర్మాణం చేపట్టాలని మరియు స్థానిక ప్రజలు కోరినట్లుగా పడిపోయిన పాత ఇనుప స్తంభాల స్థానంలో కొత్త సిమెంటు స్తంభాలు ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అధికారులను కార్పొరేటర్ గారు ఆదేశించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మా, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, పద్మ రావు, రవీందర్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, మహేందర్ సింగ్, దస్తగిర్, సుభాష్ రాథోడ్, ఫక్రుద్దీన్, లడ్డు, తుకారాం, నవీన్, రజాక్, రియాజ్, ఖాజా, ఎజాస్, రవి, ఉమా, మహిళలు దివ్య, నిరూప, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.