న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ సిఎం రేవంత్ రెడ్డితో సమావేశం

న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ సిఎం రేవంత్ రెడ్డితో సమావేశం

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా. డి. జె. పాండియన్ ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి తో సమావేశం అయ్యారు.

 

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. నదిని సంరక్షిస్తూ, నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. అలాగే మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్య రహితంగా, సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.

 

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హైదరాబాద్ లోని రెండవ దశలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు, రాష్ట్రంలో శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించే శిక్షణ సంస్థలు ఏర్పాటు కు సహకరించాలని. ఆసుపత్రుల నిర్మాణానికి, విద్యాసంస్థల హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణానికి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణాలకు, అలాగే వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. అనంతరం పాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు.

 

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజిత్ రెడ్డి, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.