న్యూ కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారం: శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్

న్యూ కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారం: శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):

శేరిలింగంపల్లి నియోజకవర్గం 108 మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలోని రోడ్ నెంబర్ 3 లో గత కొంతకాలంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది కాలనీలోని నివాసితులు ఈ విషయంపై శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ను కలిసి తమ సమస్యల్ని తెలుపగా వెంటనే వారు స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి
సమస్య తీవ్రతను తెలిపారు…. అధికారులు స్పందించి ఈరోజు తమ సిబ్బందిని పంపించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం జరిగినది. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ , వి.సంగీత వీరేందర్ గౌడ్, నల్ల సంజీవరెడ్డి,దినేష్ ముద్దంగుల తిరుపతి,మమత, జీహెచ్ఎంసీ అధికారుల చొరవతో సమస్య పరిష్కారం అయినందులకు న్యూ కాలనీ రోడ్ నెంబర్ 3 నివాసితులు హర్షం వ్యక్తంచేశారు.

Leave A Reply

Your email address will not be published.