నాయకుల కోసం సర్వస్వం ధారపోసే….కార్యకర్తల మనోవేదనను గుర్తించరా???

నాయకుల కోసం సర్వస్వం ధారపోసే ... కార్యకర్తల మనోవేదనను గుర్తించరా???

……”కార్యకర్తల మనోవేదన ఇలాంటి వారిని రోజు చూస్తూ ఉంటాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో…

 

తమ నాయకుడిని గెలిపించడానికి నిలబెట్టడానికి టికెట్ ఇప్పియ్యడానికి టికెట్ కోసం కనీసం అడగడానికి వెంబడి రావడంలో నలిగిపోయి తిరిగి తిరిగి అలిసిపోయి కేసులనో లీడర్ల పిలుపుల మీద చేసిన ఏదో రాజకీయ కేసుల జైల్ కైనా పోగలిగే, అవసరమైతే నాయకుడి టికెట్ ఎటో తెల్వడానికి కాలిపోయే / బూడిదవ్వగలిగే ధైర్యమున్న ఒక త్యాగశీలి …. “కార్యకర్త”

 

తీరా జైలుల ఉండి వచ్చినంక కూడ మనస్ఫూర్తిగా మనసుల బాధను కక్కలేక అదే లీడర్ల పేర్ల ని స్తుతిస్తూ స్పీచులు ఇవ్వగలిగిన స్థితజ్ఞాని … “కార్యకర్త”

 

ఇట్ల ఒక్క నాయకుడిని నిలబెట్టే క్రమంలో కనీసం పేపర్లో పెరు రాకున్నా , బయట పేరు రాకున్నా , కేవలం నమ్మిన లీడర్ ఫోటోనే దేవుడుగా అక్కడ ఇక్కడ లొల్లిల్లు పెట్టుకుని , అవసరము అయితే తన్నుకుని , తినీ తినక , అటుకులో గిటుకులో నిజంగా గవ్వే తిని , రూపాయి సంపాదన లేకున్నా గదే సార్ల ను జోకుడు మాత్రం బoజెయ్యలేక (ఆయింత ఉన్న ఆ ఒక్క ఛానల్ కూడా పోతే ఇదువరదాక చేసింది పోతే ఎవ్వడు రానియ్యకుంటే ఎట్లా అనే భయంతో) ఇంకా అదే స్థాయిలో సపుడుజెయ్యక ఉంటున్న గొప్ప ఓపికవంతుడు.. “కార్యకర్త”

 

ఇంట్లో పరిస్థితి ఎట్లున్నా తెల్లంగి గంజి ఏసి పెట్టుకుని సారు కార్ల సీట్ దొరుకుతే అదే లక్షల ఆస్తి అని గర్వంగా సెల్ఫీ దింపుకుని స్టేటస్ ల పెట్టి, దోస్తుల దగ్గర చూపిచ్చుకుని పాత పేపర్ కట్టింగ్లతో పాటు దాచి పెట్టుకుని సంతోషపిగలిగే అల్పసంతోషి …”కార్యకర్త”

 

ఆ స్మార్ట్ఫోన్ల ఉన్న వందల గ్రూపులల్ల డివిజన్ నియోజక వర్గ సారు యువసేన అన్ని గ్రూపులల్ల , పార్టీ గ్రూప్ లల్ల వచ్చే కుయ్యి కుయ్యి మనే మెసేజ్ లను “delete” చేసుకుంట… వేరే పార్టీ వాళ్ళతోని ఫుల్లు లొల్లిల్లు పెట్టుంకుంట… అవుతలి పార్టీలోళ్ళ ప్రశ్నలకు సమాధానాలు పెట్టుకుంట… ఆ గ్రూప్ లను చూస్కుంటా …పార్టీ కోసం దాంట్ల కూడా కొట్లాడే యోదుడు ..”కార్యకర్త”

 

మనసంతా మస్తు బాధ ఉన్నా ఆత్మీయులు కనవడంగనే నవ్వుకుంటా నమస్తే పెట్టి ఎప్పటి లేక్కనే ఒంటరిగా ఉన్నపుడు తీరని దుఖ్ఖాన్ని పంచుకునే నాధుడు లేక కనిపించని కన్నీలను దిగమింగుతున్న అన్నలారా..! మీ పాదాలకు వందనం !!

 

నల్ల సంజీవరెడ్డి

Leave A Reply

Your email address will not be published.