స్వామి వివేకానంద ఆశయాలను నేటి యువత తప్పక పాటించాలి.

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

స్వామి వివేకానంద ఆశయాలను నేటి యువత తప్పక పాటించాలి..

యువతకు, ప్రజలకు స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

జనవరి 12, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ ఖామాన్ మరియు వివేకానంద నగర్ డివిజన్ ఖామాన్ వద్ద ఉన్న విగ్రహానికి నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు,మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్,రఘునందన్ రెడ్డి,కూన సత్యం గౌడ్ మరియు డివిజన్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..స్వామి వివేకానంద యువతను ఉదేశించి “నా భవిష్యతుపై నా ఆశ ఉంది, గుణవంతులు, తెలివైనవారు ఇతరుల సేవ కోసం అన్నిటిని త్యాజించి, విధేయతతో తమకు మరియు దేశానికి పెద్దగా మంచిది అని వారు అన్నా మాటలను గుర్తుచేశారు..

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాష్పక నాగమణి యాదగిరి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్, నాయకులు సాంబశివరావు, ముకయ్య, సంగారెడ్డి, వెంకటస్వామి సాగర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్, యకయ్య, వెంకటేష్, పి.రామారావు, మల్లేష్, గోపాల్, ప్రభాకర్, శివ, ఉదయ్ రావు, పరుశురాం, ముత్తయ్య, కిషన్ రావు, కన్నా రావు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.