Nakrekal MLA Camp Office నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నీచర్ మాయం

Nakrekal MLA Camp Office నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నీచర్ మాయం

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ మాయం

 

డిసెంబర్ 13, నల్లా సమాచార్ న్యూస్ / నకిరేకల్ : నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 15 లక్షలకు పైగా ఫర్నీచర్ మాయమైందని నల్గొండ జిల్లా ఆర్ అండ్ బి (డి.ఈ) సురేంద్ర కుమార్ తెలిపారు. ఆయన సిబ్బందితో కలిసి నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని క్యాంపు కార్యాలయాలలో ఫర్నీచర్ మాయమైందని ఆయన తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు 17 లక్షలు కేటాయించి ఫర్నీచర్ కొనుగోలు చేశామని నేడు కేవలం రెండు టేబుల్స్, ఒక ఖాళీ బెడ్ కాట్ మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన తెలిపారు. మాయమైన ఫర్నీచర్ గురించి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు, పర్సనల్ సెక్రెటరీకి సమాచారం అందించామని యధావిధిగా ఫర్నిచర్ క్యాంప్ ఆఫీస్ లో ఉండాలని కోరామని లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని డి.ఈ సురేంద్ర కుమార్ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.