నాభిశిల(బొడ్రాయి) ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

నాభిశిల ( బొడ్రాయి) ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

గోపనపల్లి లో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

నల్లా సమాచార్ న్యూస్:

 

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి గ్రామంలో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

 

బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని,గ్రమంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని,ఎలాంటి అశుభలు జరుగకుండా ఉండాలని పూర్వకాలంలో మన పెద్దలు బొడ్రాయిని ప్రతిష్టించే వాళ్ళని తెలిపారు..

 

ఏదైనా వేరే గ్రామానికి వెళ్ళాలన్నా,వేరే గ్రామం నుండి వచ్చేవాళ్ళైనా బొడ్రాయిని పూజించే వాళ్ళని పేర్కొన్నారు.గ్రామంలోకి ఏ దృష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా బొడ్రాయి కాపాడుతుందని మన పెద్దల నమ్మకం అని,మధ్యలో దీనిపై కొంత అశ్రద్ధ వహించడం వల్ల,నేటి తరానికి అవగాహనా లేకుండా పోయిందన్నారు.మళ్ళీ పూర్వపు విదంగా బొడ్రాయి ని పూజించడం జరుగుతుందని,నగర విస్తరణలో భాగంగా కాలనీలు విస్తరించడంతో బొడ్రాయి పై అవగాహనా లేకపోవడం వల్ల మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు..

 

అమ్మవారి ఆశిర్వాదం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు,ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు..

 

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘునందన్ రెడ్డి,సురేందర్,శేఖర్ రెడ్డి,పోచయ్య,రవీందర్ ప్రసాద్ దుబే,చలపతి రావు,చంద్రమౌళి,నరసింహ,గోపనపల్లి వాసులు,స్థానిక భక్తులు,మహిళలు,పిల్లలు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.