ముత్యాల ముగ్గుల పోటీలు

ముత్యాల ముగ్గుల పోటీలు

ప్రజాభవన్ -12-01-2024..

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

కుడికాల మల్లేశం మెమోరియల్ ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ పార్క్ లో సంక్రాంతి పండుగ సంధర్భంగా ముగ్గల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు కూతురు శ్రీమతి నాయిని శ్రీ గోధా రెడ్డి గారు ధాత్రి ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాయిని శ్రీ గోధా రెడ్డి గారు, ఐ‌సి‌డి‌ఎస్ జిల్లా ఆఫీసర్, మధురిమ, కాజీపేట ట్రాఫిక్ సి.ఐ సుజాత, కార్పొరేటర్ రాములు, పింగిళి కాలేజీ లెక్చరర్ మాధవృ, అడ్వకేట్ గోపికా, షణ్ముఖ, బ్యూటీ పార్లర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెఞ్జ్త్ రజిత లహరి పాల్గొని ముగ్గుల పోటీలను వీక్షించారు.

 

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మహమ్మద్ శమీమ్, మిద్దెల శివరంజని, ముప్పిడి ప్రగతి నిర్వహించారు, గెలిచిన విజేతలు మొదటి బహుమతి అనూషా, రెండవ బహుమతి ఏ. అరుణశ్రీ. మూడవ బహుమతి ఏం. స్వర్ణలత లకు అందచేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.