ముత్యాల ముగ్గుల పోటీలు: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ముత్యాల ముగ్గుల పోటీలు: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమిరిశెట్టి ఫౌండేషన్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):

ముత్యాల ముగ్గుల పోటీలు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మియాపూర్ డివిజన్ పరిధిలో గల నీలిమ హైట్స్ మరియు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో గల ఇంజినీర్స్ ఎన్ క్లేవ్ 2 లో మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీలు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ప్రతి కాలనీకి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు 5 కన్సొలేషన్ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని కొమిరిశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన తరువాత సాయిబాబా మరియు రామస్వామి యాదవులు మాట్లాడుతూ “ఆరోగ్యాన్ని, పారిశుధ్యాన్ని, విజ్ఞానాన్ని మేళవించే సనాతన సాంప్రదాయమే ఇంటి ముందు ముగ్గులు వేయడం” అని అన్నారు. “ఈ ముగ్గులు అనేక రకాలు. ప్రతిరోజు ఇంటి పరిసరాలను పరిశుభ్ర పరిచి, గోమయంతో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో రకరకాల రంగవల్లులను కళాత్మకంగా మహిళలు తీర్చిదిద్దుతారు. ముఖ్యంగా ధనుర్మాసంలో. ఈ బియ్యపు పిండి తినేందుకు చీమలుచేరి క్రిమి కీటకాలను లోపలికి రాకుండా కాపాడతాయి. అలాగే గోమయం వాసన వలన కూడా విషపూరితమైన కీటకాలు ఇంటి పరిసరాలలోకి రావు. దీని వలన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా మానవులు ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. దీనితోపాటు చూడటానికి ఇంటి ముందు అందంగా కన్పిస్తాయి ముగ్గులు. ఈ ముగ్గులు వేసే ప్రక్రియలో మహిళలకు జరిగే వ్యాయామం వలన అనేక గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నివేదికలు తెలుపుతున్నాయి ” అన్నారు. “పట్టణీకరణ నేపథ్యంలో అపార్ట్ మెంట్ కల్చర్ బాగా పెరిగిన తరువాత మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించడానికి మరియు మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నాం “

అని తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా శ్రీమతి తాటిచర్ల వరలక్ష్మి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, సీతారాం మరియు స్థానిక మహిళా నాయకురాళ్ళు శ్రీమతి దుర్గ, శ్రీమతి మౌనిక, శ్రీమతి అనూష, శ్రీమతి మాధవి, శ్రీమతి మానస తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.