చదువు ఆపేసిన పిల్లలని బడిలో చేర్పించిన ఆపరేషన్ ముష్కాన్ – X జనగాం డివిజన్ టీం

చదువు ఆపేసిన పిల్లలని బడిలో చేర్పించిన ఆపరేషన్ ముష్కాన్ – X జనగాం డివిజన్ టీం

జూలై 11, నల్లా సమాచార్ న్యూస్ / జనగామ :

 

జనగామ డివిజన్ పరిధిలోని ఆపరేషన్ ముష్కాన్ – X లో భాగంగా ఈ రోజు ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటిస్తున్న సందర్భంలో ఒక ఇండస్ట్రీ లో పనిచేస్తున్న ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన పలు కుటుంబాలకు చెందిన 8 మంది విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వారిని సమీపంలో ఉన్న అంబేడ్కర్ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో వివిధ తరగతులలో చేర్పించడం జరిగింది.. ఈ ఆపరేషన్ లో జనగాం SI తిరుపతి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కుమార స్వామి, పోలీస్ విభాగం నుండి బాలాజీ, ఆలీ, విద్య లక్ష్మి, శ్రీనివాస్, చిల్డ్ డిపార్ట్మెంట్ (DCPU) నుండి ప్రణయ్, రంజిత్ కుమార్ మరియు స్కోప్ NGO నుండి ప్రాజెక్ట్ కో – ఆర్డినేటర్ మనోజ్ కుమార్, CSW తాబస్సుమ్, విద్యాశాఖ MNO రాజేందర్ పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.